పార్టీ నిర్మాణంపై దృష్టి సారించాలి
- కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీ
జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల భేటీ
ఆదిలాబాద్/ఉట్నూర్, మార్చి 2 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లాలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ సంఘటన్ సృజన అభియాన్ కార్యక్రమంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రా ల పార్టీ జిల్లా అధ్యక్షుల శిక్షణ ముగింపు శిబిరంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత, పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అద్యక్షు డు డా. నరేష్ జాదవ్, నిర్మల్ జిల్లా అధ్యక్షు డు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కుటుంబ సభ్యులు రాహుల్‌గాంధీతో కలిసారు. రాహు ల్‌కు కుటుంబ సభ్యులను పరిచయం చేసి, ఫోటోలు దిగారు.
ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా గ్రామాల్లో బలోపేతమయ్యే విధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రత్యేక కృషి చేయాలని రాహుల్‌గాంధీ అన్నారని ఎమ్మెల్యే వెడ్మ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు పార్టీ అభివృద్ధిపై తీసుకోవలసిన జాగ్రత్తలతో పా టు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిం చాలని ఈ సంద ర్భంగా పలు సూచనలు చేసినట్లు తెలిపారు.




