17 April, 2026 | 2:43 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ప్రతి వ్యక్తి బాధ్యతగా వ్యవహరించాలి

14-04-2026 01:26 AM

జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు 

అలంపూర్ ఏప్రిల్ 13: ప్రతి వ్యక్తి బాధ్యతగా వ్యవహరిస్తేనే ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఎర్రవల్లి మండల కేంద్రం గ్రామసభలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత కార్యక్రమానికి జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యంగా ఎర్రవల్లి గ్రామం జాతీయ రహదారి ఎన్హెచ్-44ను కలిగి ఉండడం వల్ల రోడ్డు భద్రతకు ప్రత్యేక ప్రాముఖ్యత అవసరమని స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రోజు 70 నుంచి 80 వరకు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, అందులో 20 నుంచి 30 మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడమేనని ఎస్పీ స్పష్టం చేశారు. అనంతరం గద్వాల డిఎస్పీ మొగిలయ్య రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో అల్లంపూర్ సర్కిల్ ఆఫీసర్ ప్రదీప్, ఇటిక్యాల ఎస్‌ఐ రవి గ్రామ సర్పంచ్ అనిత కృష్ణ సాగర్ ,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.