11 August, 2026 | 2:51 AM

50 సంవత్సరాలు నిండిన ప్రతి గీత కార్మికుడికి నెలకు రూ.5వేల పెన్షన్ ఇవ్వాలి

11-08-2026 12:12 AM

గీత పనివారల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ కోటయ్య 

నేరేడుచర్ల, ఆగస్టు10 : 50 సంవత్సరాలు నిండిన ప్రతి గీత కార్మికుడికి నెలకు 5000 రూపాయల పెన్షన్ అందించాలని గీత పని వారల సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ కోటయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.నేరేడుచర్ల మండల కేంద్రంలో గీత పనివారల సంఘ సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయ న మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం,రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేద గీత పని వారలకు అర్హత కలిగి 50 ఏళ్లు నిండితే కుటుంబ జీవనం కొరకు కనీసం నెలకు 5000 రూపాయల పెన్షన్ తో పాటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, ఉచిత విద్య ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.

గీత కార్మికుడు ప్రమాదవశాత్తు చనిపోతే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, అతని భార్యకు 5000 పెన్షన్ అందించాలని ప్రతి సొసైటీ కి మరియు టిఎఫ్టి కి తాటి ఈత వనాలు పెంచేందుకు ఐదు ఎకరాల ప్రభుత్వం భూమిని కేటాయించాలని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జిల్లాకు ఒకటి చొప్పున నీరా కేంద్రాలు ఏర్పాటు చేసి గీత కార్మికులకు జీవన ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ సభ్యత సేకరణ కార్యక్రమంలో గీత పనివారాల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పాలకూరి బాబు జై గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శి కొప్పు లక్ష్మీనారాయణగౌడ్ గీతపనివారల సంఘం నాయకులు బెల్లంకొండ గోవిందు గౌడ్ ముత్యాల భాస్కర్ బీసీ హక్కుల సాధన సమితి జిల్లా గౌరవాధ్యక్షుడు చిలకరాజు శ్రీను జిల్లా సహాయ కార్యదర్శి కొమర్రాజు వెంకట్ మండల అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్ ఏఐవైఎఫ్ మండల అధ్యక్షుడు పరికె భరత్ పాల్గొన్నారు.