గెలుపులో ప్రతి ఓటు కీలకమే
13-05-2024 02:38 AM
విప్ ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల, మే12(విజయక్రాంతి): ఎన్నికల్లో గెలువాలంటే ప్రతి ఓటు కీలకమే నని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నా రు. సోమవారం వేములవాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పలువురు ముఖ్యులతో ఆయన సమావేశం అయ్యారు. పోలింగ్‌లో బూత్ ఏజెంట్లు చేయాల్సిన విధులపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. బూత్ లెవల్ ఏజెంట్లు తగు జాగ్రత్తలు తీసుకుంటూ, ఓటర్‌లిస్ట్‌లో పేర్లను క్షుణ్ణంగా పరిశీలించాల ని సూచించారు. ఓటింగ్‌శాతం పెంచేలా నాయకులు చర్యలు తీసుకోవాలని కోరారు. రెండు నెలలుగా ఎన్నికల ప్రచారంలో తనతో పాటు పాల్గొన్న నాయకులకు, కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు.




