తనిఖీల ముసుగులో కానిస్టేబుళ్ల చేతివాటం
పట్టుబడిన నగదును కాజేసిన వైనం
ఇద్దరిని సస్పెండ్ చేసిన రాచకొండ సీపీ
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 12 (విజయక్రాంతి): వాహన తనిఖీల ముసుగులో ఇద్దరు కానిస్టేబుళ్లు చేతివాటం ప్రదర్శించారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ఓ బైక్‌పై అక్రమంగా తరలిస్తున్న రూ.25 లక్షల డబ్బును స్వాధీనం చేసుకున్న కానిస్టేబుళ్లు.. ఆ డబ్బును ఎన్నికల అధికారులకు అప్పగించలేదు. దీంతో డబ్బులు తరలిస్తున్న యువకులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో కానిస్టే బుళ్ల బండారం వెలుగులోకి వచ్చిం ది. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై విచారణ చేపట్టి చేతివాటం నిజమేనని తేల్చా రు.
ఇద్దరు కానిస్టేబుళ్లను రాచకొండ సీపీ తరుణ్ జోషి ఆదివారం సాయంత్రం సస్పెండ్ చేశారు. అయి తే వాహనదారుల వద్ద పట్టుబడిన నగదు రూ.50 లక్షలని తొలుత ప్రచారం జరిగింది. అనంతరం రూ.25 లక్షలు అంటూ ప్రచారం జరిగింది. కానీ సాయికుమార్, కార్తీ క్ అనే ఇద్దరు వ్యక్తులు అక్రమంగా తరలిస్తున్న రూ.18 లక్షలను స్వాధీ నం చేసుకున్నట్లు కీసర సీఐ ప్రకటించారు. అయితే కానిస్టేబుళ్ల వద్ద నుంచి ఎంత రికవరీ చేశారు, మొ త్తం పట్టుబడిన నగదు ఎంత అనే అంశాలపై పోలీసులు స్పష్టత ఇవ్వ డం లేదు.
రూ. కోటి పట్టుకున్నారని వదంతులు..
ఆదివారం ఉప్పల్ సమీపంలోని కీసర వద్ద హైదరాబాద్ నుంచి వరంగల్‌కు రూ. కోటి నగదు తరలిస్తున్న రెండు వాహనాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారని ఓ మీడియా సంస్థకు చెందిన వ్యక్తి వదంతులు సృష్టించారు. అయితే అలాంటిదేమీ లేదని పోలీసులు ధృవీకరించారు.




