కారు దిగి కాంగ్రెస్‌లోకి..
13-05-2024 02:39 AM
జయశంకర్ భూపాలపల్లి, మే12(విజయ క్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండల కేంద్రానికి చెందిన సుమారు 20 మంది బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆదివారం కాంగ్రెస్ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వీరికి శ్రీనుబాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.




