10 April, 2026 | 12:58 PM

Breaking News

పాలేరు ఎన్ఎస్పీ పెద్ద కాలువలోకి దూసుకెళ్ళిన ట్రాక్టర్

10-04-2026 10:50 AM

ధైర్యసాహసంతో ట్రాక్టర్ ను బయటకు తెచ్చిన సర్పంచ్..

సర్పంచ్ కు అభినందనలు వెల్లువ

కూసుమంచి,(విజయక్రాంతి):పాలేరు ఎన్ఎస్పీ కాలువలోకి ట్రాక్టర్ దూసుకెళ్లింది..ఈ విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ ధైర్యసాహసాలతో కాలువలోకి దూకి ట్రాక్టర్ ను జేసీబీ సహాయంతో బయటకు తీసుకొచ్చాడు. దీంతో సర్వత్ర ప్రశంసలు వెళ్లివెతుతున్నాయి. ఈ సంఘటన శుక్రవారం మల్లాయిగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే... ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలం మల్లాయిగూడెం గ్రామంలోని పాలేరు ఎన్ఎస్పీ కెనాల్ లోకి ట్రాక్టర్ దూసుకుపోయింది.

అప్రమత్తమైన డ్రైవర్ ట్రాక్టర్ నుంచి దూకి ఈత ద్వారా సురక్షితంగా బయటకు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ బాదావత్ నరేష్ స్థానికులతో పాటు జేసీబీని ఏర్పాటు చేసి, ఆయన స్వయంగా  ధైర్యసాహసాలు చేసి కాలువలోకి వెళ్ళి ట్రాక్టర్ ను బయటకు తీశాడు. సుమారు రెండు గంటలపాటు శ్రమించి ఆ ట్రాక్టర్ ను బయటకు తీసుకురావడంతో  స్థానికులు సర్పంచ్ ను అభినందించారు. ట్రాక్టర్ లోకి వాటర్ పోవడంతో యజమానికి తీవ్రనష్టం జరిగిందని స్థానికులు తెలిపారు.