2 June, 2026 | 12:16 PM

Breaking News

పవన్ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. హైకోర్టులో జనసేన రిట్ పిటిషన్   •   అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు   •   పదవీత్యాగాలకే కాదు.. ప్రాణత్యాగానికీ వెనుదీయని నేత కేసీఆర్   •   బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   సుప్రీంకోర్టులో ఐదుగురు నూతన న్యాయమూర్తుల ప్రమాణం   •   తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాన్ని సహించేది లేదు   •   ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు   •   లారీని ఢీకొట్టిన కారు.. సిద్దిపేటలో ఇద్దరు మృతి   •   తెలంగాణ బలానికి, ఆశయాలకు ప్రతీక: నితిన్ నబిన్   •   ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు   •  

శ్రీ భక్తాంజనేయ స్వామి సహిత శివ పంచాయతన దేవాలయంలో మహా అన్నదాన కార్యక్రమం

10-04-2026 11:23 AM

అంకుసాపూర్‌లో శ్రీ భక్తాంజనేయ స్వామి సహిత శివ పంచాయతన దేవాలయంలో మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహణ

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి సహిత శివ పంచాయతన దేవాలయంలో మూడు రోజుల పాటు ధార్మిక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలు 10-04-2026 శుక్రవారం ప్రారంభమై, 11-04-2026 శనివారం కొనసాగి, 12-04-2026 ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు మహా అన్నదాన కార్యక్రమంతో ముగిశాయి. ఈ మహా అన్నదాన కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో సేవలు అందించారు. దేవాలయ అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులు మరియు అంకుసాపూర్ గ్రామస్థులు సమిష్టిగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. భక్తులకు అన్నదానం నిర్వహించడం ద్వారా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.