28 August, 2026 | 8:21 AM

ప్రతి ఓటరు డ్రాఫ్ట్‌ను పరిశీలించాలి

28-08-2026 12:56 AM

జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ 

మహబూబాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): ప్రతి ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ 2026 డ్రాప్స్ ను పరిశీలించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, ఐదు మున్సిపాలిటీల పరిధిలోని వార్డులలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ 2026 కార్యక్రమంలో భాగంగా జిల్లా అంతటా నిర్వహించిన గ్రామ, వార్డు సభల్లో ముసాయిదా ఓటరు జాబితాను ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా  సిరోలు మండలం చిలుక్కోడు, గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రామసభలో జిల్లా కలెక్టర్ స్వయంగా పాల్గొని ఓటరు నమోదు, సవరణల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఎస్‌ఐఆర్ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ డ్రాప్టు ముసాయిదా లో తమ పేరు సరిగా ఉందో లేదో తెలుసుకొని ఓటును నిర్ధారించుకోవడం కోసం నెల రోజుల సమయం ఉందని, నోటీసులు అందుకున్న ఓటర్లు తమ నిర్ధారణ సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి సమర్పించి ఓటు హక్కును భద్రపరుచుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో గణేష్ , తహసిల్దార్ పున్నం చందర్, స్థానిక సర్పంచ్ ఉడుముల వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ తేజవాత్ సుధాకర్, లక్ష్మీనారాయణ, ఎంపీడీవో గౌస్ పాషా, పంచాయతీ సెక్రెటరీ నాగయ్య, బి.ఎల్.ఓలు, పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.