8 June, 2026 | 9:48 PM

Breaking News

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా యూపీహెచ్సి రామవరం లో అవగాహన కార్యక్రమం   •   ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కార్యశాల   •   పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ బదిలీ   •   సునంద రైస్ ఇండస్ట్రీ ట్రెండ్ లైసెన్స్ ను వెంటనే రద్దు చేయాలి   •   బదిలీపై వెళ్లిన పంచాయతీ కార్యదర్శికి సన్మానం చేసిన గ్రామస్తులు   •   ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలి   •   పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రజలపై పెను భారం మోపుతున్న మోదీ సర్కార్   •   పరిసరాల పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణకు ప్రజలు సహకరించాలి   •   చింతకుంటలో కేత్ బచావో- భూమి సంరక్షణ కార్యక్రమం   •   సమస్యలను తెలుసుకున్నందుకే బుల్లెట్ పై ప్రయాణం   •  

అందరికీ సూపర్ హీరో నాన్నే

08-10-2024 12:00 AM

సుధీర్‌బాబు హీరోగా రూపొందిన చిత్రం ’మా నాన్న సూపర్ హీరో’. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో  సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఆర్ణ హీరోయిన్ కాగా.. సాయి చంద్, సాయాజీ షిండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల సినిమా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో హీరో సుధీర్‌బాబు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు.

“ఇద్దరు తండ్రులు, కొడుకు చుట్టూ తిరిగే కథ ఇది. తండ్రిని చూసుకోవడానికి కొడుకు పడే తపనలో కొత్త అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఇది థ్రిల్లర్ కాదు. మానవ సంబంధాల మీద ఉన్న పాయింట్ ఇది. మన అందరికీ సూపర్ హీరో నాన్నే. మహేశ్‌బాబు ట్రైలర్ బాగుందని మెచ్చుకున్నారు. డైలాగ్ గురించి ప్రస్తావిస్తూ చాలా ఫన్నీగా ఉందన్నారు’ అని చెప్పారు సుధీర్‌బాబు.