Breaking News

పర్యావరణ పరిరక్షణలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలి

26-08-2026 | 08:44am

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): పర్యావరణ పరిరక్షణలో ప్రతీఒక్కరూ భాగస్వాములు కావాలని సర్పంచులు కలకోట్ల శైలేందర్,కర్నాటి వెంకన్న,నున్న యాదగిరి యాదవ్ అన్నారు.మంగళవారం మండల పరిధిలోని అడివెంల,రామన్నగూడెం,కోమటిపల్లి గ్రామాలలో వన మహోత్సవం సందర్భంగా పాఠశాల ఆవరణలో పాటు ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పచ్చదనం పెంపొందించడంతో పాటు భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన,ఆరోగ్యకరమైన వాతావరణ అందించేందుకు ప్రతీ ఒక్కరు ఒక్క మొక్క నాటాలని సూచించారు.ఆయా కార్యక్రమాల్లో ఉపసర్పంచులు లింగంపల్లి రవీందర్,వజ్జె చిన్న రవి,మాండ్ర గోవర్ధన్,వార్డు సభ్యులు,ఎఫ్ఏలు,ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు