16 April, 2026 | 2:23 AM

రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలి

16-04-2026 12:49 AM

గరిడేపల్లి,  ఏప్రిల్ 15 : రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ పాటించడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని తాసిల్దార్ స్రవంతి అన్నారు.గురువారం మండల పరిధిలోని గడ్డిపల్లి గ్రామంలో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఆమె అధికారులతో కలిసి ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు వివిధ వాహనాలపై ప్రయాణించేటప్పుడు రోడ్డు నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.

రోడ్డు భద్రత నియమ నిబంధనలపై విద్యార్థులచే ప్రజలచే ప్రతిజ్ఞ చేయించారు.కార్యక్రమంలో ఎంపీడీవో సరోజ,ఎస్‌ఐ నరేష్,ఎంఈఓ ఛత్రు నాయక్,ఏవో ప్రీతం కుమార్,గ్రామ సర్పంచ్ ఆశెట్టి నాగలక్ష్మి శ్రీహరి,మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.