ఉపాధి పనులు నాణ్యతగా నిర్వహించాలి
16-04-2026 12:49 AM
తాడ్వాయి, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): ఉపాధి పనులు నాణ్యతగా నిర్వహించాలని తాడువాయి ఇన్చార్జి ఎంపీడీవో సవిత రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం గ్రామంలో ఏండ్రియాల్ గ్రామంలో బుధవారం ఆమె ఉపాధి హామీ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం గ్రామాల్లోని కూలీలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఈ పనులు నిర్వహిస్తుందని తెలిపారు. ఈ పనులు నాణ్యతగా ఉండాలన్నారు. ప్రభుత్వం కొలతల ప్రకారమే డబ్బులు చెల్లించడం జరుగుతుందన్నారు. కొలతలు దృష్టిలో పెట్టుకుని పనులు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి అనిత, ఫీల్ అసిస్టెంట్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.






