స్వీయ గణనలో అందరూ బాధ్యతగా పాల్గొనాలి
కొత్తపల్లి, ఏప్రిల్ 27(విజయక్రాంతి): జనగణనలో భాగంగా చేపట్టిన స్వీయ గణనలో అందరూ బాధ్యతగా పాల్గొనాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శివకుమార్ పిలుపునిచ్చారు.సోమవారం కరీంనగర్ కోర్టు కాంప్లెక్స్ లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి స్వయంగా ఆన్లైన్ ద్వారా వివరాలు నమోదు చేసుకుని స్వీయ గణన ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్ మాట్లాడుతూ జనాభాగణన కీలక జాతీయ కార్యక్రమమని, ఈ కార్యక్రమం దేశంలోని జనాభా వారి, సామాజిక ఆర్థిక పరిస్థితులపై సమగ్ర సమాచారం అందించడంతోపాటు సమర్థవంతమైన ప్రణాళిక అమలుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలోని ప్రజలంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములై స్వీయ గణన చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శ్రీనివాస్ ,జిల్లా సెన్సెస్ ఇన్చార్జి తిరుపతి మరియు అధికారులు పాల్గొన్నారు.






