ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్
పట్టించుకోని అధికారులు
మఠంపల్లి ఏప్రిల్ 27 : మండల కేంద్రంలోని చేపల మార్కెట్ కి కూత వేటు దూరంలో ఎన్‌ఎస్పి కెనాల్ రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. చిన్నారుల చేతులకు అందే ఎత్తులో ట్రాన్స్ఫార్మర్ ఉండటంతో ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దిమ్మె తక్కువ ఎత్తులో ఉండటం,పైగా చుట్టు రక్షణ కంచే లేకపోవడం కంప చెట్లు అల్లుకుపోవడంతో ఏ సమయంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై స్థానికులు పలుమార్లు విద్యుత్ అధికారుల కు ఫిర్యాదు చేసిన పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు. ఈ ట్రాన్స్ఫార్మర్ స్థానికులు నివాసాలకు దగ్గరగా ఉండటంతో పాటు ప్రతి నిత్యం మూగజీవాలు,ప్రజలు,చిన్నారులు తిరుగుతుండటంతో ప్రమాదాలకు అవకాశం కలదని స్థానికులు తెలిపారు.ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు కురిసినప్పుడు మరింత ప్రమాదంగా మారే అవకాశం ఉందని ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దిమ్మె ఎత్తును పెంచి చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.






