ఆర్టీసీ ఎండీని సన్మానించిన జేఏసీ నేతలు
28-04-2026 01:52 AM
హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డిని జేఏసీ నేతలు సోమవారం ఘనంగా సన్మానించారు. తమ డిమాండ్ల సాధనలో భాగంగా ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పుడు సానుకూలంగా స్పందించినందుకు ఆర్టీసీ ఎండీని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్‌రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కోకన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేశ్, బీ యాదగిరి సన్మానించారు. ప్రభు త్వం అంగీకరించిన డిమాండ్లను పరిష్కరించేందుకు తదుపరి చర్యలు తీసుకోవాలని ఈమేరకు ఆయనకు జేఏసీ నేతలు కోరినట్టు ఒక ప్రకటనలో తెలిపారు.






