5 June, 2026 | 8:52 PM

Breaking News

భిక్కనూరు పశువైద్య అధికారిగా డాక్టర్ మౌనిక   •   పర్యావరణం బాధ్యత.. ప్రతి ఒక్కరు బాధ్యత   •   తేజస్ అకాడమీ విద్యార్థులకు డిఫెన్స్ లో ఉద్యోగాలు   •   అంజనాపురం పాఠశాలకు రాష్ట్ర ఉత్తమ పర్యావరణ పాఠశాల అవార్డు   •   టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి   •   అమేజింగ్ ఇండియన్: మాచన రఘునందన్   •   ప్రపంచ పర్యావరణ దినోత్సవం   •   సీడ్స్ కేంద్రాలను తనిఖీ చేసిన గరిడేపల్లి ఎస్ఐ   •   డ్రంక్ అండ్ డ్రైవ్ లో రూ.3 లక్షలు జరిమానా   •   రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై ఉన్న శ్రద్ధ పీవీ నరసింహారావు విగ్రహ ఏర్పాటుపై కాంగ్రెస్ కు లేదు   •  

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

05-06-2026 07:44 PM

ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల,(విజయక్రాంతి): ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని బస్టాండ్ వద్ద ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శుక్రవారం  పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పచ్చదనం పెంపొందించేందుకు మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.