31 July, 2026 | 3:14 AM

డ్రగ్స్ నిర్మూలనకు అందరూ కృషి చేయాలి

31-07-2026 02:06 AM

కలెక్టర్ ఖుష్బూ గుప్తా 

మహబూబ్ నగర్ అర్బన్ జూలై 30: మాదకద్రవ్యాల వినియోగం, సరఫరాను పూర్తిగా అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా క లెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పి డి జానకి తో కలిసి పాలమూరు యూనివర్సిటీ, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ  ప్రతిని ధులుతో పాటు వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, పోలీసు, ఎక్సైజ్, విద్యాశాఖ తదితర అధికారులతో నిర్వహించిన నార్కోటిక్స్ అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు.

మద్యం సేవించడం చాలా సందర్భాల్లో మాదకద్రవ్యాల వినియోగానికి ప్రారంభ దశగా మారుతుందని, అందువల్ల మద్యం వినియోగాన్ని కూడా కట్టడి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ  కార్యదర్శి  ఇందిర, అసిస్టెంట్ కలెక్టర్ సాయి శివాని, తదితరులు ఉన్నారు.