కేంద్ర రైల్వే మంత్రితో ఎంపీల భేటీ
ఆదిలాబా-ద్ మధ్య కొత్త రైల్వే ప్రాజెక్టు మంజూరుకు వినతి
నిర్మల్, జులై 30(విజయక్రాంతి): ఆదిలాబాద్ మధ్య కొత్త రైల్వే లైన్ కు అనుమతులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని తెలంగాణకు చెందిన బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, మాధవనేని రఘునందన్, గోడెం నగేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పైడి రాకేష్‌రెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ,
నిర్మల్ జిల్లా అధ్యక్షులు రాథోడ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైషవ్‌ని ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలిసి విజ్ఞప్తి చేశారు. ఆర్మూర్- వయా నిర్మల్ ఆర్మూర్ రైల్వే నిర్మాణం కోసం ఈ ప్రాంత ప్రజలు కోరుతున్న విషయాన్ని రైల్వే శాఖ మం త్రికి వారు వివరించారు. రైల్వే లైన్ కు కేంద్ర ప్రభుత్వం వెంటనే బడ్జెట్ కేటాయించి డీపీఆర్ రూపొందించి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.






