1 April, 2026 | 2:35 AM

పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

01-04-2026 12:00 AM

మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

వెల్దండ మార్చి 31 : బిఆర్‌ఎస్ పార్టీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పని చేయాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పిలుపునిచ్చారు . మంగళవారం వెల్దండ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ గార్డెన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.

రాబోయే రోజుల్లో పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఈ లక్ష్యాన్ని సాధించడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఐక్యతతో పని చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని, ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో గోలి శ్రీనివాస్ రెడ్డి, ఉప్పల వెంకటేష్, సత్యం, విజితారెడ్డి తదితరులు హాజరయ్యారు.