calender_icon.png 12 January, 2026 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలి

09-01-2026 12:00:00 AM

మాజీ బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి

ఖైరతాబాద్, జనవరి 8 (విజయక్రాంతి) : పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఖైరతాబాద్ నియోజకవర్గం బిజెపి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి కోరారు. హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు పందిళ్ల ప్రసాద్ ఇటీవల న్యూఇయర్ క్యాలెండర్ రూపొందిం చారు. ఆ క్యాలెండరును చింతల గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ తరపున చేసిన కార్యక్రమాల ప్రచారానికి, పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి క్యాలెండర్ ఒక మాధ్యమంగా నిలుస్తుందన్నారు.

అంతేకాకుండా నాయకులు, కార్యకర్తల పరిచయానికి ఒక ముఖచిత్రంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు పార్టీకి ఎంతో కీలకమన్నారు. అందరూ సమన్వయం తో పనిచేస్తే తప్పక విజయాలు సాధించవచ్చని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో హిమాయత్ నగర్ డివిజన్ బిజెపి అధ్యక్షురాలు జి.మాధవి,నాయకులు ప్రేమ్ సింగ్ రాథోడ్, గడ్డం వెంకటస్వామి, నర్సింగ్ ముదిరాజ్, శ్రీధర్, అభిషేక్ తదితరులున్నారు.