calender_icon.png 11 December, 2025 | 10:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిశుద్ధ్యానికి ప్రతిఒక్కరూ సహకరించాలి

08-12-2025 12:52:17 AM

ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ, డిసెంబర్ 7 (విజయక్రాంతి): మిర్యాలగూడ పట్టణంలోని సాగర్ రోడ్డు ప్రధాన రహదారిపై కూరగాయల మార్కెట్  పరిసరాలను ఆదివారం ఉదయం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్‌ఆర్)సందర్శించారు. అనంతరం ఎమ్మెల్యే  బిఎల్‌ఆర్ మాట్లాడుతూ పారిశుధ్య పనులను పరిశీలించి పారిశుధ్య కార్మికులతో మార్కెట్ లోని రైతులతో కలిసి మాట్లాడారు.

మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రం చేసి శానిటేషన్  చేయాలని అదేశించారు. మార్కెట్ పరిసరాలలోని రహదారిపై ఆకుకూరలు విక్రయించే  రైతులు చిరు వ్యాపారులు ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ప్రమాధాలు జరగకుండా.. రోడ్డుకు ఇరువైపులా  ఫుట్ పాత్ లైన్ దాటకుండా ఉండాలని సూచించారు. ఆయన వెంట మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.