08-12-2025 12:50:39 AM
అదనపు కలెక్టర్ సీతారామరావు
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), డిసెంబర్ 7 ( విజయక్రాంతి): గ్రామపంచాయతీ ఎన్నికల్లో కీలకమైన ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలన జరపాలని అదనపు కలెక్టర్ సీతారామరావు అన్నారు.ఆదివారం మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.
దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.అనంతరం మండల కేంద్రం అర్వపల్లిలోని ఎంపీడీఓ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ను సందర్శించి పోలింగ్ మెటీరియల్ విభజన ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిబంధనలు తూచా తప్పకుండా అమలయ్యేలా ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికల ప్రక్రియ జరిగేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని అబ్జర్వర్లకు,అధికారులకు చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఝాన్సీ,తహసీల్దార్ శ్రీకాంత్,ఎస్త్స్ర సైదులు,ఎంపీఓ గోపి,పీఓలు,ఓపీఓలు,మాస్టర్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.