calender_icon.png 16 October, 2025 | 10:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

18న బంద్ కు అందరూ సహకరించాలి..

16-10-2025 07:18:06 PM

బీసీ జేఏసీ నాయకుల పిలుపు...

సుల్తానాబాద్ (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల న్యాయమైన డిమాండ్ సాధన కోసం ఈ నెల 18న జరుగు రాష్ట్ర బంద్ లో భాగంగా సుల్తానాబాద్ లో బంద్ కు అన్ని వర్గాల వ్యాపారస్తులు సహకరించాలని, బీసీలందరూ ఈ బంద్ లో పాల్గొని బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గురువారం సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ లో బీసీ జేఏసీ నాయకుల సమావేశం జరిగింది. బీసీ జెఎసి రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ నాయకులు, కుల సంఘాల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో బీసీ నాయకులు తాళ్లపల్లి మనోజ్ గౌడ్, గుర్రాల మల్లేశం, సాయిరి మహేందర్, మొలుగురి అంజయ్య గౌడ్, తాడూరి శ్రీమాన్ లు మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బంద్ ను చేపట్టడం జరుగుతుందని, బీసీ రిజర్వేషన్లు పెంచడం ద్వారా అన్ని కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుందన్నారు. అన్ని కులాల వారు ఏకమై బందులో పాల్గొని బీసీల ఐక్యత చాటి చెప్పాలని పిలుపునిచ్చారు... ఈ సమావేశంలో బీసీ నాయకులు  కందుకూరి ప్రకాష్ రావు (పెద్దన్న), మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ , వేగోళం అబ్బయ్య గౌడ్, బుర్ర శ్రీనివాస్ గౌడ్, కూకట్ల  నాగరాజు, కందుల శ్రీనివాస్, రాజమల్లు , సుర శ్యామ్, దీకొండ భూమేష్ , కూకట్ల గోపి , పొన్నం చంద్రయ్య గౌడ్ , కందునూరి కుమార్, ఏకశిలా శ్రీనివాస్ , భూమయ్య, ముత్యాలు, మల్లికార్జున్, గజ బింకర్ పవన్, సతీష్ తోపాటు పెద్ద ఎత్తున  బీసీ నాయకులు పాల్గొన్నారు.