16-10-2025 07:14:57 PM
గౌరవ అధ్యక్షులుగా పోచారం అశోక్
ఏకగ్రీవంగా ఎన్నుకున్న సమాజం సభ్యులు
పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ సమాజం అధ్యక్షులు ఇప్పపల్లి నర్సింలు ఆధ్వర్యంలో గురువారం పటాన్ చెరు పట్టణంలోని ఉమామహేశ్వర ఆలయంలో పటాన్ చెరు నియోజకవర్గ అధ్యక్ష, గౌరవ అధ్యక్షులను ఎన్నుకున్నారు. పటాన్ చెరు నియోజకవర్గ వీరశైవ లింగాయత్ అధ్యక్షులుగా జగదీశ్వర్, గౌరవ అధ్యక్షులుగా పోచారం అశోక్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాపై నమ్మకంతో వీరశైవ లింగాయత్ సమాజం పటాన్ చెరు నియోజకవర్గ అధ్యక్ష, గౌరవ అధ్యక్షులను నియమించినందుకు గాను సమాజం పెద్దలకు, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. వీరశైవ లింగాయత్ సమాజం అభివృద్ధికి సభ్యులందరి సహాయ సహకారంతో అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
వీరశైవ లింగాయత్ సమాజం సభ్యులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారికి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొంక రాజేశ్వర్, కోశాధికారి పోలీస్ సంతోష్ పాటిల్, ఉపాధ్యక్షులు అవంచ సుధాకర్, జాయింట్ సెక్రెటరీ నాగరాజు, జిల్లా సలహాదారు చెలిమిడ రాములు, కార్యదర్శి నీలకంఠం గంతల బసవరాజు, పటాన్ చెరు సమాజ గౌరవ అధ్యక్షులు ఆకుల శంకరప్ప, బీరంగూడ అధ్యక్షులు బసవరాజు, ప్రధాన కార్యదర్శి సంతోష్, రాజేశ్వర్, జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి నవీన్ రామోజీ, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోనాపురం శివకుమార్, సదాశివాపేట మండల అధ్యక్షులు నాగేశ్వర్, చాట్ల రామకృష్ణ, సుభాష్, సుధాకర్, చంద్రమౌళి, నాగసంగప్ప, తదితరులు పాల్గొన్నారు.