18 July, 2026 | 3:50 AM

ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి

26-10-2024 03:48 PM

సంగారెడ్డి (విజయక్రాంతి): ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ఇతరులను ఆదుకోవాలని సంగారెడ్డి ఎస్పి చెన్నూరు రూపేష్ తెలిపారు. శనివారం సంగారెడ్డి పట్టణంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో రక్తదానం చేసి, పోలీస్ ఆయుధాలపై విద్యార్థినిలకు అవగాహన కల్పించారు. పోలీస్ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని సూచించారు. రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడాలని తెలిపారు. పోలీసులు సమాజంలో అందరికీ ఆదర్శంగా ఉండాలి అన్నారు. విద్యార్థినిలకు పోలీసులు ఉపయోగించి తుపాకులపై అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి అదనపు ఎస్పీ సంజీవరావు, డీఎస్పీలు సత్య గౌడ్, రామ్మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.