calender_icon.png 11 November, 2025 | 8:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రిలీఫ్ ఫండ్ ను ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి

11-11-2025 07:16:50 PM

కెకెఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్..

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): సీఎం రిలీఫ్ ఫండ్ ను అర్హులైన ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కెకెఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ సూచించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో కెకెఎం ట్రస్ట్ చైర్మన్, కాంటెస్టెడ్ కార్పొరేటర్ కూన శ్రీనివాస్ గౌడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇటీవలే అనారోగ్య పరిస్థితులతో ఆసుపత్రిలో చికిత్స పొందిన కొండా సుజాత, ఎరగాంధండ్ల వంశీ, సత్యనారాయణ, నీరుడు ఓంప్రకాష్, మర్గం శంకర్, కొట్టె సులోచనకి మంగళవారం మూడు లక్షల రూపాయల సీఎంఆర్ఆఫ్ చెక్కులు పంపిణి చేశారు.

ఈ సందర్భంగా కూన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో అలాగే మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు ప్రత్యేక కృషితో నియోజకవర్గంలో ప్రజాపాలన ద్వారా బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తుందని కొనియాడారు. ప్రజాపాలనలో పేద, మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజానర్సింహా కార్పొరేట్ రంగంలో వైద్యం అందించడంతో పాటు వైద్యానికి అయిన ఖర్చులు సీఎంఆర్ఆఫ్ ద్వారా పేదలకు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో దూలపల్లి మాజీ కౌన్సిలర్ బైరి శివకుమార్ గౌడ్, చౌడ శ్రీనివాస్, నాగిళ్ల శ్రీనివాస్, బాలప్ప, యాం సాగర్, ఉలిపి శ్యామ్, అరుణ్ కుమార్, రఘు గౌడ్, సంపత్, కృష్ణ, కృష్ణమ నాయుడు, కృష్ణారెడ్డి, లబ్దిదారులు పాల్గొన్నారు.