calender_icon.png 11 November, 2025 | 8:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి నిర్మూలనకు గళమెత్తిన జగద్గిరిగుట్ట ప్రజలు

11-11-2025 07:14:57 PM

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): గంజాయిలేని సమాజం నిర్మించాలని జగద్గిరిగుట్ట కార్యాలయంలో జరిగిన సమావేశంలో జగద్గిరిగుట్ట అన్ని బస్తీల కమిటీల నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు హాజరై గంజాయికి వ్యతిరేకంగా కలిసి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, బస్తీ కమిటీల నాయకులు మాట్లాడుతూ జగద్గిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో గంజాయి నిర్మూలన కోసం కలిసి పనిచేద్దామని అన్నారు. గంజాయి కేసులో పట్టుబడితే జగద్గిరిగుట్ట నుండి బహిష్కరించాలని, అన్ని బస్తీలలో గంజాయి వ్యతిరేక కమిటీలను ఏర్పాటు చేసి బస్తీ ప్రజలను చైతన్యవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.

అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు బస్తీ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 14న బాలల దినోత్సవం సందర్భంగా జగద్గిరిగుట్టలో మానవహారాన్ని వేలాది మందితో ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఇది ఆరంభం మాత్రమేనని రానున్న రోజుల్లో గంజాయి రహిత సమాజం నిర్మించడం కోసం ప్రజలంతా ఏకం కావాలని గంజాయి వ్యతిరేక కమిటీ నిర్ణయించింది.

ఈ సమావేశంలో ప్రవీణ్, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ అధ్యక్షతన సీనియర్ నాయకుడు యేసు రత్నం, మండల కార్యదర్శి స్వామి, హరినాథ్, రాములు, కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు గణేష్, యువజన నాయకులు సాయి పంతుల, పవన్ రెడ్డి, జనసేన సతీష్, హనుమంతు చారి, రాజు యాదవ్, ప్రజానాట్యమండలి బాబు,ఏఐటీయూసీ శ్రీనివాస్, దుర్గయ్య, సదానంద, శ్రీనివాస్ నగర్ ఖయ్యూం,సీనియర్ జర్నలిస్ట్ తొండ వెంకట్, లెనిన్ నగర్ సదానందం, వనం రాజు, జీవి శ్రీనివాస్,రవీందర్ గౌడ్, మైసమ్మ నగర్ బసప్ప, రవి, రవీందర్ రెడ్డి బ్రహ్మానంద చారి,కృష్ణ గుడ్ మార్నింగ్ మురళి, సూరారం కాలనీ అధ్యక్షుడు సందీప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ త్రివేణి, విశ్వబ్రాహ్మణ సంఘం మనోహర్ చారి, ప్రవీణ్, వెంకటేష్, విజయ్, రాజు, ఇమామ్ నరసింహ, సామిల్, నరసింహారెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.