calender_icon.png 13 November, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూత్ కాంగ్రెస్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

13-11-2025 12:00:00 AM

జిల్లా అధ్యక్షుడు చీకటి కార్తీక్

కొత్తగూడెం , నవంబర్ 12 ( విజయ క్రాంతి):యువజన కాంగ్రెస్ ఇల్లందు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం కొత్తగూడెం విద్యానగర్ లోని రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్ మాట్లాడుతూ ఇల్లందు నియోజకవర్గ, టేకులపల్లి ఇల్లందు మండల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేయాలని, రానున్న రోజుల్లో జరగబోయే జిల్లా ఎక్స్టెండెడ్ మీటింగ్ ను విజయవంతం చేయాలని, యూత్ కాంగ్రెస్ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రెటరీలు కసనబోయిన రామ్మూర్తి, గులాం మతిన్, పల్లి ప్రణయ్, ఇల్లందు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఈసం లక్ష్మణ్, జనరల్ సెక్రెటరీ తేజావత్ ఉమేష్, మండల అధ్యక్షులు పూనెం మధు, వాంకుడోత్ శ్రీకాంత్, ఉపాధ్యక్షులు చిలువేరు చంద్రశేఖర్, పూనం వెంకటేష్, పోరండ్ల నవీన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.