13-11-2025 12:00:00 AM
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు
అప్రమత్తమైన భద్రతా సిబ్బంది
షాపింగ్ మాల్స్, ఆలయాలు, బస్టాండ్లలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో విస్తృత సోదాలు
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 12 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో హై అలర్ట్ వాతావరణం నెలకొంది. శంషాబాద్ విమానాశ్రయాన్ని పేల్చేస్తామంటూ ఆగంతకులు పంపిన బెదిరింపు మెయిల్ తీవ్ర కలకలం రేపింది. ఇదే తరహా మెయిల్స్ దేశంలోని మరో ఐదు ప్రధాన విమానాశ్రయాలకు కూడా రావడంతో భద్రతా ఏజెన్సీ లు ఉలిక్కిపడ్డాయి. మరోవైపు, ఇటీవలి ఢిల్లీ ఘట న నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసులు అ ప్రమత్తమై, నగరవ్యాప్తంగా రద్దీ ప్రదేశా ల్లో బాంబ్ స్క్వాడ్‌లతో ముమ్మర తనిఖీలు చేపట్టారు.
హైదరాబాద్‌లోని శంషాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, చెన్ను, త్రివేండ్రం, గోవా విమానాశ్రయాలను పేల్చివేస్తామని బెదిరిస్తూ ఆగంత కులు ఇండిగో ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఇండియా కార్యాలయాలకు ఈ-మెయిల్స్ పంపారు. ఈ సమా చారం అందిన వెంటనే, ఆరు విమానాశ్రయాల్లో నూ భద్రతను కట్టుదిట్టం చేశారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లు, డాగ్ స్క్వాడ్‌లు రంగంలోకి దిగి ఎయిర్‌పోర్ట్ ప్రాంగణమంతా క్షుణ్ణంగా తనిఖీలు చేప ట్టాయి.
పార్కింగ్ స్థలాలు, టెర్మినల్ భవనాలు, కార్గో ప్రాంతాల్లో విస్తృత సోదాలు నిర్వహించారు. ప్రయాణికుల లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. దీంతో ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఢిల్లీలో ఇటీవల జరిగిన ఉగ్ర ఘటన నేపథ్యంలో, ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన బెదిరింపుతో హైదరాబాద్ నగర పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఎలాం టి అవాంఛనీయ ఘటనల కు తావులేకుండా, నగరంలోని అన్ని రద్దీ ప్రదేశాల్లో ముమ్మ ర తనిఖీలు చేపట్టారు.
ప్రధాన షాపింగ్ మాల్స్, ప్రముఖ ఆలయాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో విస్తృత సో దా లు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులపై నిఘా ఉంచాలని, ఏమాత్రం అనుమానం వచ్చి నా 100కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశామని, ప్రజలు ఆందోళన చెందవద్దని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.