17 April, 2026 | 2:54 PM

అర్హులైన ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలి

02-01-2026 12:00 AM

నాగిరెడ్డిపేట్, జనవరి 1 (విజయక్రాంతి): మండలంలోని లింగంపల్లి,బొల్లారం గ్రామాల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను నాగిరెడ్డిపేట మండల ఇన్చార్జి ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ గురువారం సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా ఇన్చార్జి ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ...మండలంలో ఆయా గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు చేపట్టాలన్నారు.లింగంపల్లి,బొల్లారం గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు పూర్తిస్థాయిలో కొనసాగుతున్నాయని తెలిపారు.

పేద ప్రజల కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కార్యక్రమాన్ని ముందుకు తెచ్చిందని ప్రతి ఒక్కరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మంజూరై నిర్మించుకోలేని స్థితిలో ఉన్నవారు వారి యొక్క సమస్యను తెలియజేస్తే కాంట్రాక్టర్ ద్వారా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణలు నిర్మించి ఇస్తామని ప్రవీణ్ కుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు ప్రభు గౌడ్, అనిత గోపాల్ గౌడ్, కార్యదర్శులు సంతోష్ కుమార్,ఫీల్ అసిస్టెంట్లు గ్రామస్తులు పాల్గొన్నారు.