calender_icon.png 2 January, 2026 | 11:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనాథాశ్రమాల్లో నోట్‌బుక్స్, పెన్నులు, పండ్లు పంపిణీ

02-01-2026 12:00:00 AM

నిజామాబాద్, జనవరి1  (విజయ క్రాంతి): నూతన  పురస్కరించుకొని  అనాధ పెన్నులు పుస్తకాలను నోట్ బుక్స్ ను నిజామాబాదు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, పంపిణీ చేశారు. నిజామాబాద్ నగరంలోని అనాధాశ్రమానికి చేరుకున్న ఆయన చిన్నారులతో సంభాషించారు, అక్కడి పిల్లలకు నోట్ బుక్స్, పెన్నులు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పిల్లలతో మమేకమై, వారి భవిష్యత్తు లక్ష్యాలపై మాట్లాడారు.

పిల్లలు విద్యలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా చిల్డ్రన్స్ హోమ్ ఫర్ గరల్స్  ( బాల సధన్ ), శిశు గృహ స్పెషలైజ్ అడాప్షన్ సెంటర్  , హియరింగ్ ఎంపెయిర్ అనాధశ్రమాలు పర్యవేక్షణ చేశారు. అనాధాశ్రమాన్ని సందర్శించిన సీపీతోపాటు అదనపు డీసీపీ ( అడ్మిన్  ) జి బస్వారెడ్డి, టౌన్ 4 ఎస్. హెచ్. ఓ సతీష్ కుమార్, టౌన్ 3 ఎస్. ఐ హరిబాబు, అనాధ ఆశ్రమాల సూపర్డెంట్లు వినోద, శోభారాణి, అనిత తదితరులు పాల్గొనడం జరిగింది.