02-01-2026 12:00:00 AM
ఎల్లారెడ్డి, జనవరి 1 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ను నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎల్లారెడ్డి ఎస్‌ఐ బొజ్జ మహేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ కి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ... ప్రకృతి పచ్చదనానికి ప్రతీకగా ఎస్పీ యం. రాజేష్ చంద్ర కు పూల మొక్కను అందజేసిన ఎస్‌ఐ బొజ్జ మహేష్. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తున్నదని ఎస్పీ యం. రాజేష్ చంద్ర పేర్కొన్నారు.
నూతన సంవత్సరంలో ప్రజల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇస్తూ, నేర నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ బొజ్జ మహేష్ మాట్లాడుతూ... జిల్లా ఎస్పీ నాయకత్వంలో పోలీసు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు.