30-07-2025 12:57:42 AM
నిర్మల్, జూలై ౨౯ (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అని రీతిగా వ్యవహరిస్తుండటంతో నిర్మల్ జిల్లాలో రాజకీయ పార్టీలు ఎన్నికలు ఉంటాయా ఉండ యా అనే సందేహం కలుగుతుంది. ఒకవైపు మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని హై కోర్టు ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై పట్టుబడుతున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ఇంకా ఒక స్పష్టత రాకపోవడంతో ఆశావాదులు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికీ నిర్మల్ జిల్లాలో స్థానిక సంస్థలైన గ్రామ సర్పంచులతో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ జిల్లా పరిషత్తుల మున్సిపాలిటీల కాలం ముగిసి ఏడాది కాలం పూర్తికాయినప్పటికీ ఎన్నికలు నిర్వహించకపోవడం కారణంగా స్థానిక సంస్థలకు పాలకవర్గాలు లేక ప్రభుత్వ నిధులు రాక పల్లెలు మున్సిపాలిటీలో అభివృద్ధి కుంటుపడుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు వచ్చి దాదాపు 21 నెలలు గడుస్తున్న ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టిన కొన్ని కారణాలవల్ల అది వాయిదా పడుతూ ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇతర రాజకీయ పార్టీల నేతలు ఆశావాదులు నిరాశ నిష్పరులకు గురవుతున్నారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికా రులకు రావడంతో తమకు పదవులు దక్కుతాయని ఆశపడ్డ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎన్నిక లు జరగకపోవడంతో ఎన్నికల కోసం వేచి చూడవలసిన పరిస్థితి నెలకొంది.
ఎన్నికలకు అధికారులు ఏర్పాటు
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు కావలసిన ఏర్పాట్లను పూర్తి చేయాలని ఇప్పటికీ ఆదేశాలు ఇవ్వడంతో నిర్మల్ జిల్లాలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు 90% ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపా రు.
జిల్లా పంచాయతీ జిల్లా పరిషత్ మున్సిప ల్ శాఖల ఆధ్వర్యంలో ఇప్పటికీ ఓటర్ల జాబితా వార్డుల విభజన ఎన్నికల సిబ్బందికి శిక్షణ పోలింగ్ సామాగ్రి పోలింగ్ బాక్సులు బ్యాలెట్ పత్రాలు ఇలా అన్ని రకాల పక్రియను పూర్తి చేసి చేశారు ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఎప్పుడు షెడ్యూల్ ప్రకటించడం దాన్ని నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టారు. పోలీస్ శాఖ సమషాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఎన్నికల నిర్వహణకు పోలీసు సిబ్బంది కూడా సిద్ధంగా ఉంచారు
రెండు విడతలుగా నిర్వహించేలా..
నిర్మల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల గ్రామపంచాయతీ ఎంపీటీసీ జడ్పీటీసీ జిల్లా పరిషత్ మున్సిపల్ ఎన్నికలను రెండు విడుదల నిర్వహించేందుకు అధికారులు ప్రతిపాద నలను సిద్ధం చేశారు. జిల్లాలో నిర్మల్ బైంసా డివిజన్లో ఉండగా మొత్తం 18 మండలాలు ఉన్నాయి. 400 గ్రామ పంచాయతీలు ఉండ గా మొదటి విడుదల నిర్మల్ డివిజన్లోని 198, రెండో విడత లో పైసా డివిజన్లోని 202 గ్రామపంచాయతీలో ఎన్నికలు నిర్వహించేలా చర్య లు చేపట్టారు హిందువుగాను 33 68 పోలింగ్ కేంద్రాలు 113 క్లస్టర్లు ఏర్పాటు చేశారు.
జిల్లా లో మొత్తం 4, 46, 2019 ఓటర్లు ఉండగా ఎన్నికలకు ఓటర్ జాబితాను కూడా సిద్ధం చేశారు. అలాగే ఎంపీటీసీ ఎన్నికల విషయానికొస్తే మొత్తం 157 ఎంపీటీసీ స్థానాలు ఉండ గా నిర్మల్ డివిజన్లో 63 రెండో విడత కింద బైంసా డివిజన్లో 90 ఎంపిటిసి స్థానాలకు రెం డు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జెడ్పీటీసీల విషయానికి వస్తే మొత్తం 18 జెడ్పిటిసి లకు గాను మొదటి విడత కింద నిర్మల్ డివిజన్లోని 9 రెండవ విడత కింద భైంసా డివిజన్లోని 9 జెడ్పిటిసి స్థానాలకు ఎన్నికలు నిర్వ హించే విధంగా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు
రిజర్వేషన్లపై తేలని పంచాయతీ
నిర్మల్ జిల్లాలో ఒకవైపు ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికారులు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్‌పై స్పష్టత రాకపోవడంతో ఆశావాదులు తమకు అనుకూలంగా రిజర్వేషన్లు వాస్తాయో లేదో అన్న బెంగ పట్టుకుంది. గత ఎన్నికల్లో ఖరారైన రిజర్వేషన్ల ప్రతిపాదికన ఎన్నికల నిర్వహిస్తారా లేక కొత్త రిజర్వేషన్లను అమలు చేస్తారా అన్న అంశంపై ప్రభుత్వం నిర్ణయం పై ఆధారపడి ఉంది.
ప్రభుత్వం మాత్రం జనాభాలో దామాషా పద్ధతిలో అధిక జనాభా ఉన్న బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇప్పటికి రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసిన కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా దాన్ని అమలు చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించడంతో అది ఎప్పటి వరకు సాధ్యమవుతుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే ఇప్పటికి కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ లపై ఒత్తిడి తీసుకొస్తుంది. ఒకవేళ ప్రభుత్వం ఈ బిల్లుకు ఆమోదం తెలిపితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ శాతం రిజర్వేషన్ కేటాయించే అవకాశం ఉండడంతో కొత్త రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరుగుతాయి అన్న ప్రచారం నిర్మల్ జిల్లాలో జోరుగా సాగుతుంది.
జిల్లా వ్యాప్తంగా రాజకీయ పరిణామాలను గమనిస్తే మూడు అసెంబ్లీ స్థానాలు ఉండగా ఖానాపూర్లో అధికార పార్టీ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ప్రాతినిథ్యం వైస్తుండగా నిర్మల్ ముధోల్ లో బిజెపి ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి రామారావు పటేల్ ప్రాతినిత్యం వహిస్తున్నారు. దీనికి తోడు భారత రాష్ట్ర సమితి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాలపై ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో ఎండగట్టి తన ఉనికిని కాపాడుకోవాలని ప్రయత్నిస్తుండడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ముక్కోణపు పోటీ ఉంటుందని మూడు పార్టీల మద్దతు ధరలు ఇప్పటినుండి తమ రాజకీయ కార్యచరణను అమలు చేస్తున్నారు