calender_icon.png 31 July, 2025 | 4:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలను కోటీశ్వరులను చేస్తాం

30-07-2025 12:45:56 AM

మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)

కామారెడ్డి, జూలై 29, (విజయక్రాంతి) మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా దోమకొండలో ఏర్పాటు చేసిన మహిళ సంఘాల సంబరాలు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆమె మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి మహిళను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు.

కామారెడ్డి జిల్లా దోమకొండ గ్రామంలోని శ్రీ వనదుర్గ పెద్దమ్మతల్లి కళ్యాణ మండపంలో దోమకొండ,  బీబీపెట్ మండలాల్లోని లబ్ధిదారులకు నూతన ఆహార భద్రత కార్డుల పంపిణీ చేశారు. మహిళా సంఘాలకు రుణాలకు  సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. మహిళా సంఘాల్లో అదనపు సభ్యుల చేర్పు లేఖలను రాష్ట్ర పంచాయితీరాజ్, మహిళా శిశుసంక్షేమ శాఖ, జిల్లా ఇంచార్జిమంత్రి ధనసరి అనసూయ (సీతక్క), ప్రభుత్వ సలహాదారు ( ఎస్సీ, ఎస్టీ, ఒబిసి, మైనారిటీ సంక్షేమం) షబ్బీర్ అలీ లబ్ధిదారులకు అందచేశారు.

ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని 352 మంది లబ్ధిదారులకు, బీబీపేట్ మండంలోని 555 మంది లబ్ధిదారులకు నూతన ఆహార భద్రత కార్డు లు, రేషన్ కార్డులోఅదనపు సభ్యుల చేర్పు లేఖలను పంపిణీ చేశారు.  జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క మాట్లాడుతూ  2004 నుండి 2014 వరకు పేద వారికి ప్రభుత్వం రేషన్ కార్డులను అందించిందని, తిరిగి ఈ రోజు పంపిణీ చేసుకోవడం జరుగుతుందని అన్నారు. కుట్టు మిషన్ పై ఆధారపడిన వారికి స్కూల్ యూనిఫామ్ పని అప్పగించడం, పెట్రోల్ బ్యాంకులు ఇప్పించడం జరుగుతుందన్నారు. షబ్బీర్ అలీ లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ దాదాపు 13 సంవత్సరాల తరువాత నూతన రేషన్ కార్డులు దాదాపు 4 వేల పైన పంపిణీ చేయడం జరిగిందని,  కొత్తగా పిల్లల పేర్లు రేషన్ కార్డులలో  జమ చేయడం జరిగిందని, ఇది నిరంతర ప్రక్రియ అని, ఎప్పటికప్పుడు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు,  ఇది ఇందిరమ్మ రాజ్యమని అందరి సంక్షేమం కొరకు పని చేస్తుందని అన్నారు. 

 లబ్దిదారులందరికీ సన్న బియ్యం అందిస్తున్నామని,  భారత దేశంలో ఏ రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ లేదని ఒక్క తెలంగాణ లోనే సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. మహిళలు కోటీశ్వరులను చేయాలని పెట్రోల్ పంపులు, ఉచిత రవాణా సదు పాయం కల్పించామని, 5 లక్షలు ఇంటి నిర్మాణానికి ఇస్తున్నామని,  ఇళ్ల మంజూరు లో చిన్నచిన్న సమస్యలతో కొందరు లబ్ధిదారులు ఇబ్బందులకు గురవుతున్నా రని వారి పట్ల సానుకూలంగా వ్యవహరిం చాలని  కలెక్టర్‌ను ఆదేశించారు.   

చివరిగా అనాథ పిల్లలకు ఆరోగ్య శ్రీ కార్డులను, నూతన లబ్ధిదారులకు రేషన్ కార్డులను, బ్యాంకు లింకేజి 45 సంఘాలకు 5 కోట్లు,  స్త్రీనిధి ఒక కోటి రూపాయల చెక్కులను పంపిణీ చేసి వనమహోత్సవంలో భాగంగా మంత్రి సీతక్కతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కలెక్టర్ ఆశిష్ సంగువన్ మొక్కలను నాటారు.  కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు పంచాయతీ కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, భిక్కనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ చైర్మన్, డిఆర్డిఓ సురేందర్, జిల్లా మహిళసంక్షేమ అధికారి ప్రమీల,  ఇతర అధికారులు, కాంగ్రెస్  నాయకులు మాజీ డిసిఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, మాజీ జెడ్పిటిసి తిరుమలగౌడ్, బద్దం ఇంద్ర కరణ్ రెడ్డి, ఐరేని  నర్సయ్య, స్వామి, నర్సారెడ్డి, రమేష్, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ఒకే కుటుంబంలా ముందుకు సాగాలి 

నిజామాబాద్ జులై 29:(విజయ క్రాంతి) నాయకులు ప్రభుత్వం  అధికారులు ఒక కుటుంబంలావుండి అభివృద్ధి చేస్తూ ముందుకు సాగాలని, స్నేహపూరితంగా చర్చలు జరిపి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, పరస్పర సహకారంతో జిల్లాలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన రివ్యూ మీటింగ్‌కు ఆమె హాజరయ్యారు. జిల్లాలోని అభివృద్ధి పనులు అలసత్వం  లేకుండా త్వరగా పూర్తి చేయాలన్నారు. వైద్య ఆరోగ్య,ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు,తాగు సాగునీరు , ఎరువులు విత్తనాలు. వ్యవసాయం, శిశు మహిళా సంక్షేమం.

పరిశుభ్రత పచ్చదనం (వన మహోత్సవం)  ఇతర అభివృద్ధి పనులపై ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర మంత్రి సీతక్క జిల్లా  కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.  ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్  మాట్లాడుతూ డెంగ్యూ వ్యాదులు సోకకుండా కఠినమైన చర్యలు తీసుకుని  జిల్లాలో ఎక్కడైనా అంటువ్యాధులు సోకితే వెంటనే అక్కడ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలి ప్రజలకు సూచన సలహాలు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణ, రాకేష్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఆదివాసులు అన్ని రంగాల్లో రాణించాలి 

నిజామాబాద్: రాజ్యాంగం నిర్మాత దాదాసాహెబ్ అంబేద్కర్ అందించిన హక్కులను కాపాడుకుంటూ ఆదివాసులు అందరం అన్ని రంగాల్లో రాణించాలని అప్పుడే సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు లభిస్తుందన్నారు.  నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ ఆది వాసి కాంగ్రెస్ బునియాది కార్యకర్త  సమ్మేళన్ లో  మంత్రి సీతక్క ప్రసంగిం చారు. కాంగ్రెస్ పార్టీ ఆదివాసులను గుర్తి స్తుందని అందుకే తాను మంచి పదవులో ఉన్నానన్నారు.  ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఆదివాసుల హక్కులు కాపాడడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కంకణబద్ధంగా పనిచేస్తుందని అన్నారు.   ఆదివాసులు  ఇప్పుడు అన్ని రంగాల్లో ఎదిగారని ఇది ఎంతో సంతోషించే తగ్గ విషయం అన్నారు.