11-02-2026 12:54:18 AM
కామారెడ్డి, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): కామారెడ్డి ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద లలో మున్సిపల్ ఎన్నికల నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.
జిల్లాలో 92 వార్డులకు ఎన్నికలు
కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి మున్సిపాలిటీలో 49 వార్డులు, బాన్సువాడ మున్సిపాలిటీలో 19 వార్డులు, ఎల్లారెడ్డి12, బిచ్కుంద లో 12 వార్డులకు బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ బూత్లను సిద్ధం చేసిన అధికారులు ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రితో మంగళవారం సాయంత్రం చేరుకున్నారు.
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
కామారెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్ కు, 7 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి బాన్సువాడ ఎల్లారెడ్డి బిచ్కుంద నాలుగు మునిసిపాలిటీలు కాగా నిజామాబాద్ లో మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు ఆర్మూర్, బోధన్, భీంగల్ మున్సిపాలిలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పోలీస్ సిబ్బందితో పాటు పోలింగ్ సామాగ్రి పోలింగ్ అధికారులు సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్
మున్సిపల్ ఎన్నికలు జరగనుండడంతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ విధించారు.
మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చెప్పండి
కామారెడ్డి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు, పోలీసులకు సహకరించాలని ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ కోరారు.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల దూరంలో నిలబడి ఉండాలని ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రజలు సహకరించాలని కోరారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన లు జరగకుండా పోలీసులు ప్రత్యేక పోలీస్ బృందాలతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.