11-02-2026 12:53:42 AM
భక్తుల కోసం ప్రత్యేక బస్సులు
జిల్లా కలెక్టర్ ప్రత్యేక చర్యలు
ఝరాసంగం(జహీరాబాద్), ఫిబ్రవరి 10 : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుండి ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. శిఖర పూజతో ప్రారంభమై శివపార్వతుల కళ్యాణసం తర్వాత నంది వాహన సే వతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. మ హా శివరాత్రికి ప్రత్యేకంగా శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయానికి దర్శించుకునేం దుకు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆం ధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి భక్తులు వేల సం ఖ్యలో వచ్చి శివయ్యను దర్శించుకుంటారు.
ప్రతి సంవత్సరం మాదిరిగా గానే ఈయేడు కూడా బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రావిణ్య ప్రత్యేక శ్ర ద్ధ తీసుకొని నెల రోజుల నుండి ఆయా శా ఖల అధికారులతో సమీక్ష సమావేశాలు ని ర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూ చించారు. జహీరాబాద్ ఆర్డీవో దేవుజా ప్ర త్యేక శ్రద్ధ తీసుకొని డివిజన్ పరిధిలోని వి విధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
జహీరాబాద్ డీఎస్పి పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి బ్రహ్మోత్సవాలలో ఎలాంటి అ వాంఛనీయ సంఘటనలు జరగకుండా జా గ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోడ్లు భవనాల శాఖ అధికారులు ఆలయానికి వ చ్చే మార్గాలలో గుంతలకు పూడ్చి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మ న్ పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు కృషి చేస్తున్నారు.
ప్రత్యేక బస్సులు ఏర్పాటు...
శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భక్తులు వచ్చి దైవ దర్శనం చేసుకుంటారు. భక్తులు రద్దీని దృష్టిలో పెట్టుకొని జ హీరాబాద్ ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఈ నెల 15న మహా శివరాత్రి, 16న నంది వాహన సేవ, 17న అగ్నిగుండం, సాయంత్రం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి పార్వతీదేవిల కళ్యాణ మహో త్సవం దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ అధికారు లు ప్రత్యేక బస్సులు నడపనున్నారు.