ఎవ్వాహ్ -వీవర్స్ హబ్ ఎగ్జిబిషన్..
ప్రారంభించిన నటి అక్కినేని అమల
హైదరాబాద్, ఏప్రిల్ 4(విజయక్రాంతి): ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో గల పైర్ వాటర్ నియో కిచెన్ బాంకెట్ హాల్‌లో సోషలైట్ అలేఖ్య రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎవ్వాహ్ -వీవర్స్ హబ్ ఎగ్జిబిషన్‌ను శనివారం నటి, బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ కో-ఫౌండర్ అక్కినేని అమల ప్రారంభించారు.ఈ సందర్భంగా అమల మాట్లాడుతూ చేనేత అమ్మ చల్లని ఒడివంటిదని అభివర్ణించారు.
భారతీయ సంస్కృతిలో పట్టు, హ్యాండ్ లూమ్ వస్త్రోత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. చేనేత దుస్తులను ప్రతి ఒక్కరు ధరించాలని, చేనేత కారులను మరింత ప్రోత్సహించాలని కోరారు.నిర్వాహకులు అలేఖ్య రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 5వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో సాంప్రదాయ వస్త్రాలు, చేతితో తయారు చేసిన ప్రత్యేక వస్త్రోత్పత్తుల కలెక్షన్ వేదికగా చేనేతకారులు పోచంపల్లి, ఫైతాని, పటాన్, పటోలా, బనార్సి, ఇక్కత్, కంచిపట్టు,
ఛందేరి, నారాయణపేట, బాంధిని, కోట, వేంకటగిరి, ప్యూర్ కాటన్ వంటి వేలాది రకాల వస్త్రోత్పత్తులు ప్రదర్శనలో ఉంచారని అన్నారు.నేత కార్మికులను ప్రోత్సహించడంతో పాటు చేనేత పరిశ్రమకు మార్కెట్ను అందించడమే ఈ ఎగ్జిబిషన్ ప్రధాన సామాజిక లక్ష్యం అని తెలిపారు. మొదటి సారిగా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన ప్రతి నెలలో ఒకసారి ఉంటుందన్నారు. వివరాల కోసం ఆంపిల్ రీచ్ పి.ఆర్ + 91 9542976567 సంప్రదించగలరు.




