5 April, 2026 | 4:30 AM

బీసీలు రాజ్యాధికారం సాధించాలి

05-04-2026 12:41 AM
  1. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ 

ఎల్బీనగర్‌లో బీసీ ఆత్మగర్జన సభ

హాజరైన బీసీ సంఘాల నాయకులు, ప్రతినిధులు 

ఎల్బీనగర్, ఏప్రిల్ 4: ’మేమెంతో... మాకంతే’ నినాదంతో బీసీ కులాలు ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించి రాజ్యాధికారం సాధించాలని ఎంపీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు పిలుపునిచ్చారు. బీసీ రాజ్యాధికార వేదిక అధ్యక్షుడు ఐతగోని రాఘవేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ పరిధిలోని చింతలకుంట ప్రళవి గార్డెన్స్ లో శనివారం ‘బీసీ ఆత్మ గర్జన సభ’ నిర్వహించారు.

ఈ సభలో ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. కాం గ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు చట్టసభల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలకతీతంగా బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి ఉద్యమిస్తేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి  బీసీలను చిన్న చూపు చూస్తూ.. 42 శాతం ఉద్యమం పని అయిపోయిందని అనుకుంటున్నారని, కానీ అంతం కాలేదని హెచ్చ రించారు.

రేవం త్ రెడ్డి సీఎం పదవికి రిజర్వేషన్లకు లింక్ ఉందని ఆర్. కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ ఉద్యమం ఈ స్థాయికి రావడానికి ఎంతో శ్రమించామని  ఇక బీసీ యు వకులు రాజ్యాధికార సాధనలో ముందుకు రావాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. అగ్రవర్ణ ఆధిపత్యంలోని పార్టీలు బీసీలకు అధికారం దక్కడం ఇష్టం లేదని, ఇందులో భాగంగా బీసీలకు ఉచిత పథకాల పేరుతో మభ్య పెడుతున్నారని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ విమర్శించారు.

రాజ్యాధికారమే ధ్యేయంగా బీసీలు ఆత్మగౌరవంతో ఉద్యమించి, ఓట్లు మనవే... సీట్లు మనవే స్ఫూర్తితో చట్టసభల్లోకి వెళ్లాలని సూచించారు.  బీసీలు అను చరులుగా కాకుండా నాయకులుగా ఎదగాల్సిన సమ యం వచ్చిందని బీసీ ఇంటలె క్చువల్స్ ఫోరం చైర్మన్ టి. చిరంజీవులు పిలుపునిచ్చారు. 

బీసీల్లో నాయకత్వ లక్షణా లు పెంపొందించుకోవాలని, వారిని సమర్థ నాయకులుగా తీర్చిదిద్దడమే బీసీ రాజ్యాధికార వేదిక లక్ష్యమని ఐతగోని రాఘవేంద్ర  గౌడ్ స్పష్టం చేశారు. బీసీ ఆత్మగర్జన సభలో మాస్’ వ్యవస్థాపక అధ్యక్షుడు కటకం నర్సింగ్ రావు, గీత కార్మిక కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్, కాచం సత్యనారాయణ, బీసీ నేత వీజీఆర్ నారగోని, పాలకూరి అశోక్‌గౌడ్,

బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, నాయకులు ఈశ్వరమ్మ యాదవ్, కుంట్లూర్ వెంక టేశ్‌గౌడ్, వేములయ్యగౌడ్, సుర్వీ యాద య్యగౌడ్, చామకూర రాజు, బీసీ కులాల సమన్వయ వేదిక అధ్యక్షుడు బొమ్మ రఘు రాం నేత, నాయకులు ఎర్రమాద వెంకన్న నేత, కేవీ గౌడ్, గజ్జె శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ కాసోజు విద్యారాణి, బూతే దేవన్న, కేతావత్ రాజు, మారుపంగ వెంకన్న, సుర్వీ రమేశ్ గౌడ్, సుర్వీ మహేందర్  పాల్గొన్నారు.