24 July, 2026 | 3:18 PM

కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి

24-07-2026 02:17 PM

నీట్ పేపర్ లీకేజీతో ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు

బోథ్. జూలై 24 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతీసిన నీట్ పేపర్ లీకేజీ సంఘటనలో ఆత్మహత్యలకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్సిగ్రేషియా ఇవ్వాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడానికి నిరసిస్తూ ఇంటర్ డిగ్రీ తరగతుల బంద్ చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మండల కన్వీనర్ మున్షిప్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల లక్షరాదిమంది విద్యార్థులు భవిష్యత్తు దెబ్బతిన్నని వాపోయారు బాధ్యులైన కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రశాంత్ విద్యార్థులు పాల్గొన్నారు.