మాజీ ఎమ్మెల్యే భర్త దేవేందర్‌రెడ్డిపై వేటు
కోనాపూర్ సొసైటీ చైర్మన్ పదవి తొలగింపు
మెదక్, మే 26 (విజయక్రాంతి) : మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి భర్త, రామాయంపేట మండలం కోనాపూర్ పీఏసీఎస్ చైర్మన్ దేవేందర్‌రెడ్డిని చైర్మ న్ పదవి నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కోనాపూర్ సొసైటీలో రూ. 2.26కోట్ల అవకతవకలకు పాల్పడినట్లు గతంలో కథనాలు ప్రచురితమయ్యా యి. అప్పట్లో చైర్మన్ పదవి నుంచి దేవేందర్‌రెడ్డిని తప్పించారు. అయితే ఆయన కోర్టుకు వెళ్లి మళ్లీ చైర్మన్‌గా కొనసాగారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నందున దేవేందర్‌రెడ్డిని ఏమీ చేయలేని పరిస్థితి ఉందని అప్పట్లో కొందరు డైరెక్టర్లు ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే దేవేందర్‌రెడ్డిని చైర్మన్ పదవి నుంచి తొలగిం చాలని డైరెక్టర్లు డిమాండ్ చేయడంతో ఆయనను చైర్మన్ పదవి నుంచి తొలగిస్తూ కో ఆపరేటివ్ శాఖ ఉత్తర్వలు జారీ చేసింది.






