5 August, 2026 | 3:34 PM

హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

27-05-2024 12:41 AM

కరీంనగర్, మే 26 (విజయక్రాంతి): కరీంనగర్‌లోని పలు హోటళ్లలో ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. హోటళ్లలోని కిచెన్, స్టోర్‌రూంలో నిల్వ ఉంచిన వస్తువులను, నాసిరకం తినుబండారాలను, కాలం చెల్లిన జీడిపప్పు, సాస్‌లు, ఆహార పదార్థాలకు ఉపయోగించే క్రీమ్‌లను గుర్తించారు. చాక్లెట్ సిరప్‌తో పాటు ఇతర వస్తువు లను గుర్తించి శాంపిళ్లను సేకరించి కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వరంగల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ అమృతశ్రీ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ బృందాలు తొలుత శ్వేత హోటల్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.70 వేల విలువ చేసే కాలం చెల్లిన పదార్థాలను గుర్తించారు. కిచెన్‌లో తనిఖీ చేసి 25 రకాల నిల్వ ఉంచిన వండిన పదార్థాలను గుర్తించారు. అలాగే ప్రతిమ, విందు హోటళ్లలో తనిఖీలు చేపట్టా రు. ఈ సందర్భంగా నోటీసులు జారీ చేసి 14 రోజుల్లో మార్పు రాకుంటే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.