ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపాల్‌కు బెయిల్
14-12-2024 12:42 AM
కోల్‌కతా, డిసెంబర్ 13: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీకర్ మెడికల్ కాలేజీ లేడీ డాక్టర్ హత్యాచార కేసులో ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే కాలేజీలో ఆర్థిక అవకతవకలకు సంబంధించిన కేసులో ఆయన జైలులోనే ఉండనున్నారు. ఆగస్టు 9న నైట్ డ్యూటీలో ఉన్న ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన జరిగింది. కోల్‌కతా హైకోర్టు ఆదేశాలతో సీబీఐ ఈ కేసు దర్యాప్తును చేపట్టింది. ఈ కేసులో సంబంధమున్న ఆరోపణలతో సందీప్ ఘోష్‌తోపాటు పోలీసాఫీసర్ అభిజిత్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. అప్పటినుంచి జైలులో ఉన్న వీరిద్దరికి సీల్దా కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.






