ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
పెబ్బేరు, ఏప్రిల్ 11:పెబ్బేరు మున్సిపాలిటీ కేంద్రంలో శనివారం మహనీయుడు జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ జ్యోతిరావు పూలే యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించగా, పెద్ద సంఖ్యలో స్థానికులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం నిర్వహించిన సభలో జ్యోతిరావు పూలే యువజన సంఘం, మత్స్యకార సహకార సంఘం సభ్యులు మాట్లాడుతూ, సమాజంలో సమానత్వం, విద్యా ప్రాధాన్యత కోసం జ్యోతిరావు పూలే చేసిన కృషిని స్మరించారు. జ్యోతిరావు పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. సమాజంలోని వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సహకార సంఘం సభ్యులు చింతకాయల కురుమూర్తి, గోనెల బాలస్వామి, సహదేవుడు, చింతకాయల మహేష్, ఎస్. శ్రీనివాసులు, బీముడు, తిరుపతయ్య, సాయన్న, శివ తదితరులు, అలాగే జ్యోతిరావు పూలే యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.




