గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకం
జనగణన ట్యాబ్లు ఆవిష్కరించిన మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్, మే 11(విజయ క్రాంతి) :జనగణన 2027లో భాగంగా సమగ్ర, ఖచ్చితమై న గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తా నుండి పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వరకు మొదటి దశ జనగణనపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలోకలెక్టర్ ప్రతి మా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి మారథాన్ వాక్ కార్యక్రమాన్ని పాల్గొని ఇం టింటి సందర్శనతో అవగాహన కల్పించారు.
ప్రజల సహకారంతో కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. అనంత రం జనగణన ట్యాబ్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...చాలా సంవత్సరాల తర్వాత భారతదేశంలో జనగణన చేయడం జరుగుతుందని, 2021లో జ నగణన జరగాల్సింది ఉంది కానీ కోవిడ్ కా రణంగా జరగలేదని, స్వాతంత్రం వచ్చినప్ప టి నుండి చేస్తున్న జనగణన ఇది 16వసారి, మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇది మొదటి జనగణన అని, మొదటి సారి డిజిటల్ విధానంలో ఈ జనగణన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. స్వీయ గణన అనే విధానం తొలిసారి ప్రవేశపెట్టి జ నగణన ప్రక్రియలో నూతన అధ్యాయానికి నాంది పలకడం జరిగిందని పేర్కొన్నారు.
మీ కుటుంబ వివరాలను స్వయంగా మీరే నమోదు చేసుకునే చేసుకునే అవకాశం స్వీ య గణన ద్వారా కల్పించారని, ఇందులో 3 4 ప్రశ్నలు ఉన్నాయని, కేవలం ఐదు నిమిషాల్లో స్వీయ గణన ప్రక్రియను పూర్తి చే యవచ్చని పేర్కొన్నారు. సోమవారం నుండి జనగణన ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలను సేకరించడం జరుగుతుందని అన్నారు. వారికి ప్రత్యేక ఐడీ కార్డులు కూడా జారీ చేశామని, ఇంటికి వచ్చినప్పుడు వారికి సహకరించాలని కోరారు. జనగణన పేరుతో ఎవరైనా అనుమానిత వ్యక్తులు మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగే అవకాశం ఉంటుందని, అలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు.
జనగణనలో పాల్గొనే సిబ్బందికి జారీ చేసిన గుర్తింపు కార్డుల మీద క్యూ ఆర్ కోడ్ ఉంటుందని, దానిని స్కాన్ చేస్తే అధికారిక వెబ్ సైట్ లో పొంది ఉంచిన వారి పూర్తి వివరాలు వస్తాయని, ప్రజలు ఈ విషయాన్ని గమనించా లని విజ్ఞప్తి చేశారు. జనగణన ప్రక్రియ చాలా ముఖ్యమైనదని, జనగణనలో భాగస్వామ్యులు అయ్యే బాధ్యత ప్రతీ ఒక్కరికీ ఉంటుందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధికా భూపతి రాజు, ఆర్డీవో రమాదేవి, డీఎఫ్‌ఓ జోజి, పరిశ్రమల అధికారి ప్రకాష్ రావు, తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సంబంధిత జిల్లా అధికారులు వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులు క్రీడాభిమానులు, విద్యార్థులు పాల్గొన్నారు.






