అతి వ్యాయామంతో ప్రాణాపాయం
- ‘కోలా యూరిన్’ పట్ల జాగ్రత్త!
- ‘ఏఐఎన్‌యూ’ వైద్యుడు దీపక్
హైదరాబాద్, మార్చి 26 (విజయక్రాంతి): జిమ్ములో మితిమీరిన కసరత్తులు చేయడం ప్రాణాల మీదకు తెస్తుందని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రోలజీ అండ్ యూరాలజీ వైద్యులు, డాక్టర్ దీపక్ రాగూరి (సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్) హెచ్చరిస్తున్నారు. తక్కువ సమయంలోనే కండలు పెంచాలనే ఆరాటంతో చేసే కఠినమైన వ్యా యామాలు ‘రాబ్డోమయోలిసిస్’ అనే ప్ర మాదకర పరిస్థితికి దారితీస్తాయన్నారు.
‘కండరాలు విపరీతంగా అలసిపోయినప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు వాటిలోని కణాలు విచ్ఛిన్నమై ‘మయోగ్లోబిన్’ అనే ప్రోటీన్‌ను రక్తంలోకి విడుదల చేస్తాయి. ఈ ప్రోటీన్ కిడ్నీలలోని సూక్ష్మ నాళాలను మూసివేస్తుం ది.దీనివల్ల కిడ్నీలు తాత్కాలికంగా లేదా శాశ్వతంగా దెబ్బతింటాయి. సకాలంలో గుర్తించకపోతే డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది’ అన్నారు. జిమ్ముకు వెళ్లే వారు మొదటిరోజే కఠినమైన వ్యాయామాలు వ ద్దు. క్రమక్రమంగా తీవ్రతను పెంచాలి.
నీరు ఎక్కువగా తాగాలి. వ్యాయామానికి ముందు, తర్వాత శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. కండరాలు కోలుకోవడానికి వారంలో కనీసం ఒక రోజైనా వి శ్రాంతి ఇవ్వాలి. తీవ్రమైన నొప్పి ఉంటే వ్యాయామం ఆపేయాలి. పెయిన్ కిల్లర్స్ వేసుకుని మరీ జిమ్ చే యడం ప్రాణాంతకం’ అని వివరించారు.




