అగ్రగామి హెల్త్‌కేర్ యూట్యూబ్ ఛానల్‌గా కేర్ హాస్పిటల్స్
- ఆరోగ్య సమాచారం కోసం ప్రజల విశ్వాసం కేర్ వైపు
- యూట్యూబ్‌లో 12 లక్షల సబ్‌స్ర్కైబర్లు
హైదరాబాద్, మార్చి 26(విజయక్రాంతి): కేర్ హాస్పిటల్స్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా 12 లక్షల (1.2 మిలియన్) సబ్‌స్ర్కైబర్లను దాటుతూ దేశంలో అగ్రగామి హెల్త్‌కేర్ డిజిటల్ వేదికగా నిలిచింది. నమ్మదగిన ఆరోగ్య సమాచారం, నిపుణుల సూచ నలతో ప్రజల్లో విశ్వాసం పెంచుకుంటూ ఈ మైలురాయిని చేరుకుంది. లక్షణాలు, చికిత్స లు, సమయానికి వైద్యం అవసరాన్ని సులభంగా వివరించడం ద్వారా రోగులు, కుటుం బాలకు ఉపయోగపడుతోంది.
ఆసుపత్రి సేవలను ఆసుపత్రి గోడలకే పరిమితం చేయకుం డా, డిజిటల్ వేదికల ద్వారా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నంలో భాగంగా కేర్ హాస్పిట ల్స్ ఈ ఛానల్‌ను అభివృద్ధి చేసింది.డాక్టర్లు, నిపుణులు వీడియోలు, అవగాహన కార్యక్రమాలు, చర్చల ద్వారా నేరుగా ప్రజలతో మమేకమవుతున్నారు. ఈ ఛానల్‌లో 3,600కు పైగా వీడియోలు ఉండగా, మొ త్తం 180 మిలియన్ వీక్షణలు నమోదయ్యా యి. కార్డియాలజీ, ఆంకాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, రోబోటిక్స్, ప్రివెంటివ్ హెల్త్‌కేర్ వంటి విభాగాలపై వీడియోలు అందుబాటులో ఉన్నాయి.
ఈ సందర్భంగా కేర్ హా స్పిటల్స్ చీఫ్ ఆఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ శలభ్ దాంగ్ మాట్లాడుతూ, డిజిటల్ వేదికలు ఆరోగ్య కమ్యూనికేషన్‌లో కీలకంగా మారాయి. ప్రజలు ఆన్‌లైన్‌లో సమాచారాన్ని ఎక్కువగా ఆశ్రయిస్తున్న ఈ సమయం లో, ఖచ్చితమైన,నమ్మదగిన సమాచారాన్ని అందించడం ఆసుపత్రుల బాధ్యత అని తెలిపారు.
హెడ్ డిజిటల్ స్ట్రాటజీ అండ్ గ్రోత్ జీవన్ కొమ్ము మాట్లాడుతూ, డిజిటల్ టీమ్ కృషి, డాక్టర్ల సహకారం, ప్రేక్షకుల విశ్వాసం కలిసి ఈ విజయాన్ని సాధించాయి. భవిష్యత్తులో కూడా మరింత ఉపయోగకరమైన కంటెంట్‌ను అందిస్తాం అన్నారు.బహుభాషా కంటెంట్, పేషెంట్ ఎంగేజ్మెంట్, నిపు ణుల చర్చలతో డిజిటల్ విస్తరణను మరింత బలోపేతం చేయాలని కేర్ హాస్పిటల్స్ యోచిస్తోంది. ప్రజలకు సులభంగా అర్థమయ్యే ఆరోగ్య సమాచారాన్ని అందించడం లక్ష్యంగా ముందుకు సాగుతోంది.




