12 March, 2026 | 3:14 PM

పోలీస్ భార్య వేధింపులతో భర్త ఆత్మహత్య.. సూసైడ్ నోట్‍లో సంచలన విషయాలు

12-03-2026 01:00 PM

హైదరాబాద్: నేరేడ్ మెట్ లో ఎక్సైజ్ సీఐ జ్యోతి భర్త శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నారు. భార్య జ్యోతి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు భర్త సూసైడ్ నోట్ రాశాడు. సీఐగా జ్యోతికి పదోన్నతి పొందినప్పటి నుంచి బెదిరించేదని శ్రీనివాస్ ఆరోపించాడు. అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్లు విడాకుల కోసం దరఖాస్తు చేసుకుందని సూసైడ్ నోట్ లో వెల్లడించారు. పోలీస్ స్టేషన్ కు పిలిపించి సీఐ జ్యోతి బెదిరించేదని సూసైడ్ నోట్ లో శ్రీనివాస్ వాపోయాడు. భార్య వేధింపులతోనే ప్రాణాలు తీసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ లో జ్యోతి భర్త వెల్లడించాడు.