calender_icon.png 27 October, 2025 | 11:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం షాపులకు డ్రా ఏర్పాటు.. ఆ జిల్లాల్లోనే అత్యధికంగా దరఖాస్తులు

27-10-2025 08:28:33 AM

రాష్ట్రంలో 2,620 మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు

కలెక్టర్ల చేతుల మీదుగా మద్యం దుకాణాల లాటరీ

హైదరాబాద్: నేడు కలెక్టర్ల చేతుల మీదుగా మద్యం దుకాణాల(Liquor Shops) లాటరీ తీయనున్నారు. లాటరీ పద్దతిలో మద్యం దుకాణాల లైసెన్స్ ల ఎంపిక జరగనుంది. మద్యం దుకాణాల లాటరీ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో 2,620 మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్(Shamshabad) మండలంలోనే 100 మద్యం షాపులకు 8,536 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.సరూర్ నగర్ లో 134 మద్యం షాపులకు 7,845 దరఖాస్తులు, మేడ్చల్ లో 144 మద్యం షాపులకు 6,063 దరఖాస్తులు, మల్కాజిగిరిలో 88 మద్యం షాపులకు 5,168 దరఖాస్తులు రాగా, అత్యల్పంగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 32 మద్యం షాపులకు 680 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొన్నారు.