27-10-2025 09:49:27 AM
ముంబయి: మహారాష్ట్ర దక్షిణ ముంబైలోని(Mumbai) క్రాఫోర్డ్ మార్కెట్ సమీపంలోని ఒక ప్రముఖ షూ బ్రాండ్ షోరూమ్‌లో(Shoe Showroom) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. "లోకమాన్య తిలక్ రోడ్డులోని ద్వారకాదాస్ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ షోరూమ్‌లో మంటలు( Fire Breaks Out) చెలరేగాయి. రాత్రి 10.26 గంటలకు ముంబై అగ్నిమాపక దళానికి దీని గురించి సమాచారం అందింది.
మొదట దీనిని లెవల్ వన్ గా వర్గీకరించారు. కానీ తరువాత రాత్రి 10.44 గంటలకు పొగ ప్రక్కనే ఉన్న దుకాణాలకు వ్యాపించడంతో లెవల్ II కి అప్‌గ్రేడ్ చేయబడిందని అధికారులు తెలిపారు. డీఎఫ్ఓ సంతోష్ సావంత్ మాట్లాడుతూ, "రెండంతస్తుల బాటా షోరూమ్‌లో మంటలు చెలరేగాయి. పాదరక్షలు, విద్యుత్ కేబుల్స్, వైరింగ్, ఫాల్స్ సీలింగ్ మొత్తం కాలిపోయాయి. మేము ఇప్పుడు మంటలను అదుపులోకి తెచ్చాము. ఎవరూ గాయపడలేదు. మంటలకు కారణం ఇంకా దర్యాప్తులో ఉంది. దాదాపు ఆరు అగ్నిమాపక యంత్రాలు., ఎనిమిది నీటి ట్యాంకర్లతో మంటలను అదుపుచేశాం" అని డీఎఫ్ఓ సంతోష్ సావంత్ పేర్కొన్నారు.